ఒమిక్రాన్ ‘పరేషాన్’.. ఏపీలో కొత్తగా ఏడుగురికి ఒమిక్రాన్

అటు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ… ఏపీలోనూ ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మంగళవారం నాడు రాష్ట్రంలో కొత్తగా ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యశాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ఒమన్ నుంచి, ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు ఏపీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Read Also: శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల బయటే జనం పడిగాపులు

కాగా ఒమిక్రాన్ బాధితుల్లో కృష్ణా జిల్లా వాసులు ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లా వాసులు ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఇద్దరు ఉన్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో ఒకరు మోస్తరు లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ ద్వారా వెల్లడించింది. మిగిలిన బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి పెరిగింది.

ఒమిక్రాన్ 'పరేషాన్'.. ఏపీలో కొత్తగా ఏడుగురికి ఒమిక్రాన్

Related Articles

Latest Articles