అమెరికాలో క‌రోనా విల‌యం: ఒక్క‌రోజులో మిలియ‌న్‌ కేసులు న‌మోదు…

అమెరికాలో క‌రోనా వీర విజృంభ‌ణ చేస్తున్న‌ది.  కేసులు భారీగా పెరుగుతున్నాయి.  గ‌త ఏడాది డెల్టా వేరియంట్ స‌మ‌యంలో ఒక్క రోజులో అత్య‌ధికంగా 2 ల‌క్ష‌ల వ‌ర‌కు కేసులు న‌మోద‌వ్వ‌గా, ఈ ఏడాది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కార‌ణంగా భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఆదివారం రోజున యూఎస్‌లో 5.90 ల‌క్ష‌ల కోవిడ్ కేసులు న‌మోద‌వ్వ‌గా దానికి డ‌బుల్ స్థాయిలో మిలియ‌న్ క‌రోనా కేసులు సోమ‌వారం రోజున న‌మోదైన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  24 గంట‌ల్లో సుమారు 4 ల‌క్ష‌ల కేసులు అద‌నంగా పెర‌గ‌డంతో యూఎస్ లో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకొవ‌చ్చు.  

Read: పెరుగుతున్న పాజిటివిటీ రేటు… లాక్‌డౌన్ త‌ప్ప‌దా?

వ్యాక్సినేష‌న్ వేగంగా అమ‌లు చేస్తున్నా కేసులు న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌పంచంలో ఏ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రోజులో మిలియ‌న్ కేసులు న‌మోద‌వ్వ‌లేదు.  కేసులు పెరుగుతుండ‌టంతో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని, ఆర్హులైన ప్రతి ఒక్క‌రూ త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అమెరికా అధికారులు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.  వ్యాక్సిన్ తీసుకోని వారికే త్వ‌ర‌గా క‌రోనా సోకుతున్న‌ది.  వ్యాక్సిన్‌పై అపోహ‌లు ప‌క్క‌న‌పెట్టి  ప్ర‌తి ఒక్క‌రూ డోసులు తీసుకోవాల‌ని లేదంటే తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  

Related Articles

Latest Articles