12 సెప్టెంబర్ 2021 ఆదివారం దినఫలాలు

మేషం : ప్రైవేటు సంస్థల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలలో వారికి శుభదాయకం. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు, బకాయిల వసూళ్ళ విషయంలో జాప్యం తప్పదు. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.

వృషభం : మీ సమర్థత, నిజాయితీలు ఆలస్యంగా వెలుగు చూస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రేమికులు అవగాహనా లోపం వల్ల విడిపోయే ఆస్కారం వుంది. ఉద్యోగస్తులు అధికారులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీ గౌరవాభిమానాలకు భంగం కలిగే సూచనలున్నాయి.

మిథునం : మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. స్త్రీలు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని మెలగడం క్షేమదాయకం.

కర్కాటకం : స్త్రీలు షాపింగ్‌లోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఏ విషయాన్ని తెగే వరకు లాగడం మంచిదికాదు. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయభేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి.

సింహం : మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చికాకులు, నిరుత్సాహం తప్పవు. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. అవగాహన లేని విషయాలకు, చేతగాని పనులకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.

కన్య : వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. గట్టిగా ప్రయత్నిస్తేనే మొండి బాకీలు వసూలవుతాయి. రెట్టించిన ఉత్సాహంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. బిల్లులు చెల్లిస్తారు.

తుల : చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మొహమ్మాటం వీడి లౌక్యం ప్రదర్శించండి. సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథక ఏజెంట్లకు రావలసిన బిల్లులు మజూరవుతాయి. స్త్రీలకు టీవీ చానెళ్ళ నుంచి ఆహ్వానం అందుతుంది.

వృశ్చికం : చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా సమర్థించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం ఆలస్యంగా అందడంతో నిరుత్సాహం తప్పదు. ఏ విషయానికి కలిసిరాని మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహపరుస్తుంది. క్రయ, విక్రయాలు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు తగ్గకపోగా, మరింత ధనవ్యయం అవుతుంది.

ధనస్సు : స్త్రీల అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి.

మకరం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ వహించండి. సోదరులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. రుణప్రయత్నం వాయిదాపడగలదు. లీజు, ఎజన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉండగలదు. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.

కుంభం : స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో సంతృప్తికానరాదు. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఒంటరిగా ఏ పని చేయడం క్షేమంకాదని గమనించండి.

మీనం : ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. రుణాలు తీరుస్తారు. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తికానరాదు. వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోగలవు.

Related Articles

Latest Articles

-Advertisement-