కమల్ “విక్రమ్” కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ స్టంట్ మాస్టర్స్

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ స్టంట్ కో-ఆర్డినేటర్స్ ద్వయాన్ని రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఈరోజు లోకేష్ ట్విట్టర్‌ లో కమల్ తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న స్టంట్ కో-ఆర్డినేటర్స్ ద్వయం అన్బరివ్‌తో కలిసి ఉన్న పిక్ ను ట్వీట్ చేస్తూ వారిని ప్రాజెక్ట్ లోకి స్వాగతించారు. కెజిఎఫ్ చాప్టర్ 1 లో ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీకి జాతీయ అవార్డును గెలుచుకున్న అన్బరివ్, “విక్రమ్‌”లో కొన్ని హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందించనున్నారు. ఇది అవుట్-అండ్-అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పుడు తమిళనాడు అంతటా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “విక్రమ్” ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూట్ కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-