స్టార్ హీరోయిన్ కి ఒమిక్రాన్.. ఆందోళనలో ఫ్యాన్స్

ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో స్టార్లు కరోనా బారిన పడుతుండడం అభిమానవులకు భయాందోళనలను కలిగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా పలు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ శోభన ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు.

” లోకమంతా నిద్ర పోతున్న వేళ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. నాకున్న లక్షణాలు ఏంటంటే.. కీళ్లనొప్పులు, చలి, కొద్దిగా గొంతు నొప్పి.. ఇవన్నీ మొదటి రోజు ఉన్నాయి. ప్రస్తుతం కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటికే రెండు టీకాలు తీసుకోవడం వలన ఒమిక్రాన్‌ ముప్పు నుంచి 85శాతం కోలుకుంటామని నమ్ముతున్నాను. దయచేసి అందరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శోభన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన శోభన ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రల్లో నటిస్తుంది. మరో పక్క డ్యాన్స్ స్కూల్ నడుపుతూ అందరికి భారతీయ నృత్యాన్ని నేర్పిస్తుంది.

https://www.instagram.com/p/CYgp00jvHAx/

Related Articles

Latest Articles