బ్యాడ్ న్యూస్ చెప్పిన సీనియర్ హీరోయిన్ మీనా..

రోజురోజుకు కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. చిత్ర పరిశ్రమలో ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా పలువురు స్టార్లు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె కాకుండా ఆమె ఫ్యామిలీ అంతా కరోనాతో పోరాడుతున్నారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

” కొత్త సంవంత్సరం మా ఇంట్లోకి అనుకోని అతిథిలా మిస్టర్. కరోనా వచ్చింది. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలరా అందరు జాగ్రత్తగా ఉండండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. బాధ్యతగా మసులుకొని.. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై మీనా అభిమానులు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.. అంతేకాకుండా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Related Articles

Latest Articles