హీరో నానికి కౌంటర్ ఇచ్చిన సీనియర్ హీరో సుమన్

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు ప్రముఖులు నోరు విప్పి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అందులో హీరో నాని చేసిన ఘాటు కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక నానికి కౌంటర్ గా పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా నాని వ్యాఖ్యలపై సీనియర్ హీరో సుమన్ స్పందించారు. నేడు  తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సుమన్.. సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై స్పందించారు.

” నేను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్ళు కావస్తోంది. 10 భాషల్లో 600 సినిమాల్లో నటించాను.. చిత్ర పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో ఎదిగాను. సినిమా టిక్కెట్ల సమస్యను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలి. సినిమా రంగంలో ఐక్యత లేదనడం వాస్తవం కాదు. కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి సీనియర్లు ఉన్నారు.. వారి సలహా తీసుకోవాలి.. ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు. ఇక రాజకీయాలు ఇప్పుడు నేను మాట్లాడను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుమన్ మాట్లాడింది నానికి కౌంటర్ గానే అంటూ పలువురు గుసగుసలాడుతున్నారు.

Related Articles

Latest Articles