‘బలమెవ్వడు’లో సుహాసిని కీలక పాత్ర

దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసిని. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సుహసిని అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారామె. గతంలో ఎన్టీయార్ – కృష్ణవంశీ ‘రాఖీ’ చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. ‘ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ పాత్రను ‘బలమెవ్వడు’ చిత్రంలో పోషిస్తున్నార’ని ఆ చిత్ర దర్శకుడు సత్య రాచకొండ చెబుతున్నారు. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా ‘బలమెవ్వడు’ చిత్రాన్ని ఆర్.బి. మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఈ సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశించబోతోంది. ఇందులో మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రను సుహాసిని పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్ కు మంచి స్పందన లభిస్తోందని, సుహాసిని పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-