‘బంగార్రాజు’లో సీనియర్ నటి!

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున బంగార్రాజు – రాముగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జయప్రద కోసం ఓ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట దర్శకుడు. ఆమె క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండనుందట. ఇక జయప్రద కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన జయప్రద.. హిందీ ఫీల్డ్‌కు వెళ్లి అక్కడ కూడా అగ్రకథానాయికగా వెలిగారు. ఆ తరువాత రాజకీయ అరంగ్రేటం కూడా చేశారు. కాగా, ఆమె తిరిగి సినిమాల్లో నటిస్తుందని ప్రచారం జరుగుతూనే ఉన్నప్పటికీ ఇంతవరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరి నాగ్ ‘బంగార్రాజు’ సినిమాతోనైనా రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-