సీనియర్ నటుడు మురళీ శర్మకు గౌరవ డాక్టరేట్

టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ శర్మ తాజాగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ మురళీ శర్మకు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయనను శాలువాతో కప్పి, డాక్టరేట్ ఇచ్చి అభినందించారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచిన ఆయనను ఇలా డాక్టరేట్ తో గౌరవించడం సంతోషంగా ఉందని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఇక మురళీ శర్మ సైతం ఇలాంటి గౌరవాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

Read Also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు… 200 కోట్ల కుచ్చు టోపీ

గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ “అలా వైకుంఠపురంలో” అల్లు అర్జున్ తండ్రిగా నటించిన మురళీ శర్మ నటనపై ప్రశంసల జల్లు కురిసింది. ఆయన ఇటీవల వచ్చిన ‘వరుడు కావలెను’ సినిమాలో చివరి సారిగా కన్పించారు. సీనియర్ ఆర్టిస్టుగా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న శర్మ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ నటుడు. ఆయన చేతిలో ఇప్పుడు దాదాపు ఇద్దరు సినిమాలు ఉన్నాయి. ఆ జాబితాలో మేజర్, రాధేశ్యామ్, శ్యామ్ సింగ రాయ్, ఖిలాడీ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి.

సీనియర్ నటుడు మురళీ శర్మకు గౌరవ డాక్టరేట్
సీనియర్ నటుడు మురళీ శర్మకు గౌరవ డాక్టరేట్

Related Articles

Latest Articles