మహబూబ్ నగర్ జిల్లాలోని ఆ మున్సిపాలిటీలో స్వచ్చంద లాక్ డౌన్ 

మహబూబ్ నగర్ జిల్లాలోని ఆ మున్సిపాలిటీలో స్వచ్చంద లాక్ డౌన్ 

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  కరోనా హైదరాబాద్ నగరంతో పాటుగా జిల్లాల్లోని చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  మహబూబ్ నగర్ జిల్లాలోని భుత్పూర్ మున్సిపాలిటీలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో అక్కడి మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది.  మున్సిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు.  కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ చైర్మన్ బస్వరాజు గౌడ్ పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణలో 5892 కరోనా కేసులు నమోదవ్వగా, 46 మంది మృతి చెందారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-