‘లీడర్‌’ సీక్వెల్‌ తప్పకుండా చేస్తాను.. హీరో అతడే: శేఖర్ కమ్ముల

సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24న థియేటర్లోకి రానుంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హాట్టహాసంగా జరిగింది. ఇక చిత్రబృందం కూడా లవ్ స్టోరీ ముచ్చట్లతో బిజీబిజీగా ప్రమోషన్ చేస్తున్నారు. కాగా, దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాల గూర్చి తెలియజేశారు. ‘లవ్ స్టోరీ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తోని తెలిపారు. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నామన్నారు. ధనుష్ కు బాలీవుడ్ లోను మార్కెట్ ఉంది. అందుకే పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నాము’ అని తెలిపారు.

ఇక లీడర్ సినిమా గూర్చి మాట్లాడుతూ.. ‘నేను తీసిన ‘లీడర్’ సినిమా అప్పుడు అందరు మామూలుగానే చూశారు కానీ ఇప్పుడు ఇంకా ఆ సినిమా గూర్చి మాట్లాడుకుంటారు. అలానే నేను ప్రతీ సినిమాని సన్నివేశాన్ని ఇంతకు మించి ఎవరూ తియ్యలేరు అన్నట్టుగా చెయ్యాలని ప్రయత్నిస్తాను. ఒక పదేళ్ల తర్వాత నా పిల్లలకి కూడా గర్వంగా సినిమా చూపించగలగాలి అనుకుంటాను. ‘లీడర్’ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు. అదే పాత్రలతో రానా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే నడిచే విధంగా సీక్వెల్ చేస్తాను’ శేఖర్ కమ్ముల తెలిపారు.

-Advertisement-‘లీడర్‌’ సీక్వెల్‌ తప్పకుండా చేస్తాను.. హీరో అతడే: శేఖర్ కమ్ముల

Related Articles

Latest Articles