‘లవ్ స్టోరీ’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఇదే

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన ‘లవ్ స్టోరి’ సినిమా ఈనెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల పోస్టర్లు, టీజర్, పాటల ద్వారా సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక నిన్న విడుదల అయినా ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ఇకపోతే సెన్సార్ సభ్యులు కూడా శేఖర్ కమ్ముల సినిమాను ప్రశంసించారు. ఈమేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల 25 నిముషాలుగా వుంది.

మిడిల్ క్లాస్ యువకుడిగా నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చారని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. సంతోషం, బాధ, ప్రేమ, ఉద్యోగం, కుటుంబం.. ఇలా జీవితంలోని అన్ని రంగులు చూపించాడట. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Image

Related Articles

Latest Articles

-Advertisement-