అభిమానుల ప్రేమను అంచనా వేస్తున్న ‘లవ్ స్టోరీ’!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లును కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోను థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్లు ఓపెన్ అయిన మొదటివారంలోనే ‘లవ్ స్టోరీ’ సినిమా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుందట చిత్రబృందం.

Read Also: నయనతార చిత్రానికి అతడే విలన్!

దర్శకుడు శేఖర్ కమ్ముల తొలుత అనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న మూవీ రిలీజ్ అనుకున్నప్పటికి.. అప్పటికే కరోనా సెకండ్ వేవ్ షురూ కావటంతో దాని విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు రావడంతో ‘లవ్ స్టోరీ’ మేకర్స్ విడుదలకు ఉత్సాహపడుతున్నారట. అయితే థియేటర్లు పునప్రారంభమైన వెంటనే ప్రేక్షకులు వస్తారా.. లేదా అనేది అంచనా వేస్తున్నారట దర్శకనిర్మాతలు. గత ఏడాది పరిస్థితులను కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాపై పూర్తి నమ్మకంగా వున్న చిత్రబృందం.. ప్రేక్షకులు కూడా వస్తారని ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతిత్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

-Advertisement-అభిమానుల ప్రేమను అంచనా వేస్తున్న ‘లవ్ స్టోరీ’!

Related Articles

Latest Articles