దసరాకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘సీటీమార్’

గోపీచంద్, తమన్నా జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీ విడుదలైన కమర్షియల్ గా మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. భూమిక, రెహ్మాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కి, యువతనూ ఆకట్టుకుంది. కమర్షియల్ హంగుల్ని దర్శకుడు సంపత్ నంది చక్కగా అద్దగా, దానికి తగ్గట్టుగానే మణిశర్మ మాస్ ను అలరించే ట్యూన్స్ ఇచ్చారు. దాంతో ఇది మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు దసరా కనుకగా ఈ నెల 15న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. సో… థియేటర్లలో మూవీ చూడటం మిస్ అయిన వాళ్ళు ఇక ఓటీటీలో చూసి ఆనందించొచ్చు.

-Advertisement-దసరాకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'సీటీమార్'

Related Articles

Latest Articles