నేడే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్

మాచో హీరో గోపీచంద్ హీరోగా యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ ఈ చిత్రంలో కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఇద్దరూ రెండు కబడ్డీ జట్లను లీడ్ చేస్తారు. ఈ స్పోర్ట్స్ మూవీలో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

Read Also : తగ్గేదే లే బేబమ్మ… పాన్ ఇండియా మూవీ ఆఫర్ ?

కాగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరో రెండ్రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-