“సీటిమార్” ట్విట్టర్ రివ్యూ

మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” ఎట్టకేలకు ఈ రోజు థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రెహమాన్, దేవ్ గిల్, భూమిక చావ్లా, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, జయప్రకాష్, ప్రీతి ఆస్రాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస చిత్తూరి తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ లో సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తోంది. సినిమా ప్రేమికులు, అటు గోపిచంద్ అభిమానులు కూడా సినిమాపై, చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం సినిమా ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్తుండడంతో సోషల్ మీడియాలో “సీటిమార్” అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

Read Also : “సీటిమార్” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే ?

మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ బజ్ రావడంతో చిత్రబృందం కూడా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల వెయిటింగ్ కు సరైన ఫలితం దక్కింది. ఇక ఈ మూవీ గోపీచంద్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని ప్రభాస్ అభిమానులు సైతం ట్వీట్ చేస్తుండడం విశేషం. “సీటీమార్” ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని, ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని ట్విట్టర్ లో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాగున్నాయని, గోపీచంద్ నటన నెక్స్ట్ లెవెల్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమన్నా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అంటున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-