దేవుడా.. బుజ్జి ఏంటి ఇలా అయిపోయింది..?

‘రన్ రాజా రన్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సీరత్ కపూర్. ఈ చిత్రంలో ‘బుజ్జి మా.. బుజ్జి మా’ సాంగ్ ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో అమ్మడి దశ మారిపోతుంది అనుకున్నారు. కానీ , అవకాశాలు అంతంత మాత్రంగానే మారాయి. ఇక ఆ తరువాత నాగార్జున నటించిన రాజుగారి గది 2 లో నాగ్ తో కలిసి గ్లామర్ ఒలకబోసి ఈ భామకు అప్పుడైనా విజయం అందుతుందేమో అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియా లో సీరత్ అందాల విందుకు మాత్రం ఎలాంటి డోకా లేదు.

చిట్టిపొట్టి డ్రెస్ లతో అందాల ఆరబోతకు అమ్మడు తగ్గేదేలే అన్నట్లు మారింది. తాజాగా సీరత్ పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫొటోలో సీరత్ ని గుర్తుపట్టడమే కష్టంగా మారింది. ‘రన్ రాజా రన్’ లో కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండే ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు బక్కచిక్కి కనిపించింది. అయితే చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు కానీ.. మరీ ఇంతలా చిక్కితే గుర్తుపట్టడమే కష్టంగా మారింది అంటున్నారు నెటిజన్లు.. వైట్ సిల్క్ డిజైనర్ డ్రెస్ లో కర్లీ హెయిర్ తో దర్శమిచ్చిన అమ్మడు కూసింత కంగారు పుట్టించేలానే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. దేవుడా … సీరత్ ఏంటి ఇలా అయిపోయింది అని కొందరు అంటుంటే .. ఇంకొందరు బక్కచిక్కడానికి బృంద అంబాసిడర్ లా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

Latest Articles