పుష్ప: సెకండ్ సింగిల్ శ్రీవల్లి అప్డేట్ వచ్చేసింది

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ – ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం పుష్ప.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు విభాగాలుగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన రాగా, మొదటి సింగిల్ ‘దాక్కో.. దాక్కో.. మేక’ సాంగ్ కు కూడా ప్రేక్షకుల ఆదరణతో రికార్డులకు ఎక్కింది.

తాజాగా, పుష్ప సెకండ్ సింగిల్ తేదీని ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన శ్రీవల్లి సెకండ్‌ సింగిల్‌ ను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం డిసెంబర్‌ 17న థియేటర్లలో విడుదల కానుంది.

Image
-Advertisement-పుష్ప: సెకండ్ సింగిల్ శ్రీవల్లి అప్డేట్ వచ్చేసింది

Related Articles

Latest Articles