జాన్ అబ్రహాం చేత కంటతడి పెట్టించిన ‘సెకండ్ హ్యాండ్ బైక్’!

జాన్ అబ్రహాం అంటే అమ్మాయిలు మైమరిచిపోతారు. అంతే కాదు, బాలీవుడ్ హాట్ హంక్ జీవితంలోనూ బాగానే రొమాన్స్ ఉంది. ఎఫైర్లు ఉన్నాయి. కానీ, తన గాళ్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ అయినప్పుడు కూడా జాన్ ఏడ్చాడో లేదోగానీ… ఓ బైక్ అమ్మేసినప్పుడు కంట నీరు పెట్టుకున్నాడట!
జాన్ అబ్రహాం ఏడ్వాల్సినంత ప్రత్యేకత కలిగిన సదరు బైక్, ఆయన మొట్ట మొదటి టూ వీలర్! అందుకే, తాను ఓ పార్సీ వ్యక్తి వద్ద కొని తిరిగి మరొకరికి అమ్మేసేటప్పుడు మనసు చాలా బాధకి లోనైందట. 17,500 రూపాయలకు ‘యమహా ఆర్ డీ 350’ వెహికల్ జాన్ కొన్నాడు. మళ్లీ తాను సెకండ్ హ్యాండ్ లో కొన్న సేమ్ బైక్ ను… 21వేలకు మూడేళ్ల తరువాత అమ్మేశాడట! అంత గుడ్ అండ్ ఫర్ఫెక్ట్ కండీషన్ లో మెయింటైన్ చేసేవాడట. కానీ, తీరా తన తొలి బైక్ అమ్మేశాక దుఃఖం కట్టలు తెంచుకుందట!
జాన్ అబ్రహాంకు ఇప్పటికీ ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్ అంటే పిచ్చి. ఆయన గ్యారేజ్ లో బోలెడు కళ్లు చెదరగొట్టే టూ వీలర్స్ ఉన్నాయి. అయితే, అవేవీ ఎంతో ఇష్టపడి, కష్టపడి కొనుక్కున్న తొలి వాహనానికి సాటి రావు కదా!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-