రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..వీటిపైనే చర్చ

ఇవాళ రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ముందుగా ఒక్క రోజే శాసన సభా సమావేశాలు నిర్వహించాలనుకున్నా… టీడీపీ డిమాండ్‌కు ఓకే చెప్పి ఈ నెల 26 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. మరోవైపు మొదటి రోజు సమావేశాల్లో కుప్పం రిజల్ట్‌ హాట్ టాపిక్ అయ్యింది.అసెంబ్లీలో తొలిరోజు మహిళా సాధికారత అంశంపై స్వల్ప కాలిక చర్చను చేపట్టారు. పలువురు మహిళా సభ్యులు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా కుప్పం కోర్ టాపిక్‌గా మారింది. చివరగా ముఖ్యమంత్రి జగన్.. మహిళా సాధికారత అంశంపై మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో మహిళల అభ్యున్నతికి ఏం చేయనందునే.. కుప్పం ఫలితం రూపంలో దేవుడు మొట్టికాయలు వేశారని ఎద్దేవా చేశారు. సమావేశాలు పొడిగించాలని బీఏసీలో డిమాండ్ చేసిన టీడీపీ.. సభలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినా.. సభలోకి రాకుండా తన ఛాంబర్‌కే పరిమితం అయ్యారు. అయితే కుప్పం ఎఫెక్ట్‌తో చంద్రబాబు అసెంబ్లీకి రాలేదేమో అని సెటైర్లు వేశారు సీఎం జగన్‌. ఇప్పటికైనా చంద్రబాబు తప్పులను తెలుసుకోవాలని సూచించారు.
ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు పూర్తి అవుతాయి. రాజ్యాంగ అనివార్యత కారణంగా నిన్న ఒకరోజు సమావేశం నిర్వహించి… శాసనమండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత డిసెంబర్ నెల మూడో వారంలో 5, 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం… టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చింది. బీఏసీలో సమావేశాలు పొడిగించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్నారు. దీంతో సీఎం జగన్ కూడా అనూహ్యంగా సమావేశాల కొనసాగింపునకు అంగీకరించడం హాట్‌ టాపిగ్గా మారింది. ఇప్పుడు టీడీపీనే పారిపోకుండా సభకు రావాలని చురకలు అంటించారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

Related Articles

Latest Articles