షాకింగ్ న్యూస్.. చైనాలో బయటపడ్డ మరో 18 ప్రమాదకర వైరస్‌లు

కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరోసారి ప్రమాదకర వైరస్‌లు వెలుగుచూశాయి. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిందని వస్తున్న వార్తల నేపథ్యంలో కొంతమంది శాస్త్రవేత్తలు చైనాలోని జంతువుల మాంసం విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు జరిపారు. ఈ పరిశోధనల్లో ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 16 రకాల జాతులకు చెందిన 1725 వన్యప్రాణులపై వారు పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరీక్షల్లో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్‌లను సైంటిస్టులు కనుగొన్నారు. వీటిలో 18 ప్రమాదకర వైరస్‌లు ఉన్నాయని వారు వెల్లడించారు.

Also Read: వైరల్… హద్దులు దాటిన ఇద్దరు అబ్బాయిల ప్రేమకథ

వైరస్‌ల వ్యాప్తిలో వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని.. అందుకే తాము చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన జంతువులపైనా పరిశోధనలు చేసినట్లు ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ పరీక్షల్లో తాము 71 రకాల వైరస్‌లను కనుగొనగా.. అందులో 45 రకాల వైరస్‌లు కొత్తవి అని.. వీటిలో 18 రకాల వైరస్‌లు మనుషులు, జంతువులకు ప్రమాదకరమైనవి అని తమకు స్పష్టమైందని తెలిపారు. పిల్లుల మాదిరిగా ఉండే సివెట్స్ అనే జంతువుల్లో అత్యధికంగా ప్రమాదకర వైరస్‌లు ఉన్నట్లు గుర్తించామన్నారు. గబ్బిలాల నుంచి వచ్చే హెచ్‌కేయూ8 రకం వైరస్ కూడా ఓ సివెట్‌కు వ్యాప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.

Related Articles

Latest Articles