విద్యాసంస్థల ప్రారంభానికి సిద్ధమవుతున్న కేరళ

భారత్‌లో వెలుగుచూస్తోన్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో.. ఇంకా మెజార్టీ కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 19,675 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 45,59,628కి పెరిగింది. ఇవాళ మరో 142 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు.. దీంతో.. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 24,039కి చేరింది. అయితే, ఇక, విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది కేరళ ప్రభుత్వం.. నవంబర్‌ 1వ తేదీ నుంచి కేరళలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు జరుగనున్నాయి. మిగతా విద్యార్థులకు నవంబర్‌ 15 నుంచి పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయిని తెలిపింది సర్కార్.. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో.. కేరళలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడు కాస్త తగ్గుతూ వస్తున్నాయి.. ఇక, ప్రభుత్వం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించడానికి కేటాయించిన సమయం.. మరో నెలకు పైగా ఉండడంతో.. అప్పటి వరకు కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తాయని అంచనా వేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

-Advertisement-విద్యాసంస్థల ప్రారంభానికి సిద్ధమవుతున్న కేరళ

Related Articles

Latest Articles