నేటి నుండే తెలంగాణ విద్యా సంస్థలు ప్రారంభం…

తెలంగాణలో నేటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. అయితే ప్రత్యక్ష తరగతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన హెకోర్టు.. పిల్లలను బడికి రావాలని బలవంత పెట్టొద్దని సూచించింది. స్కూళ్లు తెరుచుకోవచ్చని చెప్తూనే.. కండీషన్స్‌ అప్లై అంటోంది న్యాయస్థానం.

తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. నేటి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానుంది. స్కూళ్ల ఓపెనింగ్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కొన్ని షరతులు విధిస్తూ స్కూళ్ల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. పాఠశాలలకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని కండిషన్‌ పెట్టింది. స్కూళ్లకు రాని విద్యార్థులతో పాటు తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో క్లాసులు ప్రారంభించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. వారంలోపు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

స్కూళ్ల ప్రారంభంపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఉత్తర్వులు ఇచ్చారని.. పిల్లలపై థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయని.. అలాంటప్పుడు స్కూళ్లను తెరిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పిటిషనర్‌ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. భౌతిక తరగతులపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఇంకా కొవిడ్‌ తీవ్రత కొనసాగుతోందని చెప్పిన న్యాయస్థానం… సెప్టెంబరు-అక్టోబరులో కరోనా మూడో దశ ముప్పు హెచ్చరికలు.. మరోవైపు విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటినీ సమన్వయం చేసి చూడాలని వ్యాఖ్యానించింది. తర్వాతి విచారణను అక్టోబర్‌ 4కి వాయిదా వేసింది.

నేటి నుంచి స్కూల్స్ ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. ఇష్టం లేకుంటే పిల్లలను ఎవరూ బలవంత చేయొద్దని పాఠశాలలకు సూచించింది. పాఠశాలల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే కీలక మార్గదర్శకాలు జారీ చేసింది విద్యాశాఖ.

Related Articles

Latest Articles

-Advertisement-