163 మోస్ట్ పాప్యులర్ వెబ్ సిరీస్ లలో… ఇండియా నుంచీ ‘ఆ ఒక్కటే’!

ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన సూపర్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’. ఇప్పటికే ఆన్ లైన్ లో అందర్నీ అలరించిన బయోపిక్ సిరీస్ తాజాగా మరో అరుదైన ఘనత స్వంతం చేసుకుంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ‘స్కామ్ 1992’ ఐఎండీబీ ఆల్ టైం లిస్టులో చొటు దక్కించుకుని సరికొత్తగా అప్లాజ్ అందుకుంటోంది!

ఇంటర్నెట్ మూవీ డాటా బేస్ (ఐఎండీబీ) వెబ్ సైట్ రూపొందించిన ఆల్ టైం బెస్ట్ వెబ్ సిరీస్ అండ్ టెలివిజన్ షో ప్రస్తుతం చర్చగా మారింది. మొత్తం 163 పేర్లు ప్రతిష్ఠాత్మక పట్టికలో ఉండగా… ఇండియా నుంచీ కేవలం ఒకే ఒక్క సిరీస్ కు చోటు దక్కింది. అదే ‘స్కామ్ 1992’.

అనూహ్యమైన స్పందన స్వంతం చేసుకుని… భారతీయ ప్రేక్షకుల్లో వెబ్ సిరీస్ లకు ఉన్న విజయావకాశాల్ని పట్టి చూపింది… ‘స్కామ్ 1992’. హర్షద్ మెహతా జీవిత కథగా వచ్చిన ఈ రియలిస్టిక్ థ్రిల్లర్ నెటిజన్స్ ను మెస్మరైజ్ చేసేసింది. దాంతో తెరపై హర్షద్ మెహతాగా కనిపించిన ప్రతీక్ గాంధీ హన్సల్ మెహతా లాంటి దర్శకుడు లభించటం తన అదృష్టం అంటూ వ్యాఖ్యానించాడు. ‘స్కామ్ 1992’ తరువాత ‘బిగ్ బుల్’ పేరుతో అభిషేక్ బచ్చన్ కూడా హర్షద్ మెహతా బయోపిక్ చేశాడు. కానీ, బాలీవుడ్ నుంచీ వచ్చిన బిగ్ మూవీ ‘బిగ్ బుల్’ …. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ ని కొట్టలేకపోయింది! జనం ఓటీటీ సీరీస్ కే ఎక్కువగా ఓటు వేశారు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-