బక్రీద్:​ ఆంక్షలు ఎత్తివేయడంపై.. సుప్రీంకోర్టు ఆగ్రహం!

కేరళ ప్రభుత్వం బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపునిచ్చింది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై అందరు యుద్ధం చేస్తున్న వేళ పూర్తి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని, కన్వర్ యాత్ర కేసుకు సంబంధించి తామిచ్చిన ఆదేశాలను ఇక్కడా పాటించాలని ఆదేశించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-