నెట్టింట్లో దిలీప్, సాయేషా రేర్ ఫోటో హల్చల్!

‘అఖిల్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన సాయేషా సైగల్…. దిలీప్ కుమార్ కు మనవరాలు అవుతుంది. దిలీప్ భార్య సైరాబాను మేనకోడలు షహీన్ బాను కూతురే సాయేషా. విశేషం ఏమంటే… సాయేషా తన బాల్యంలో దిలీప్, సైరాబానులతోనే ఎక్కువ సమయం గడిపింది. బుధవారం కన్నుమూసిన లెజండరీ ఆర్టిస్ట్ దిలీప్ కుమార్ ను తలుచుకుంటూ తన బాల్యంలో ఆయనతో ఆడుకున్న విశేషాలను తెలియచేస్తూ ఓ పాత ఫోటోను సాయేషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

‘నా చిన్నతనంలో ఎక్కువ సమయం మీతో గడిపే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం. లెజెండ్ గా ప్రపంచం భావించే మీతో కలిసి గడిపే సమయం నాకు చిన్నప్పుడే దక్కడం గొప్ప విషయం. మీతో పాడటం.. డాన్స్ చేయడం వంటిని ఎప్పటికి మర్చిపోలేను. ఎన్నో విషయాలను నేను మీ నుండి నేర్చుకున్నాను’ అని సాయేషా పేర్కొంది. సాయేషా తల్లిదండ్రులు షహీన్, సుమిత్ 2003లో విడిపోయినా, సైరాబాను తన మేనకోడలికి అండగా ఉంది. అంతేకాదు… సాయేషా తమిళ హీరో ఆర్యను 2019లో హైదరాబాద్ లో వివాహం చేసుకున్నప్పుడు దిలీప్, సైరాబాను స్వయంగా ఆ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-