బీజేపీ నాయకులు దివాలకోరు మాటలు మానుకోవాలి: సత్యవతి రాథోడ్


మీ రాజకీయ పబ్బం గడువు కోవడం కోసం గిరిజనుల భుజాలపై తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం బీజేపీ నేతలు మానుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఇకనైనా రాష్ర్ట బీజేపీ నేతలు దివాల కోరు మాటలను మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధంగా గిరిజనులకు రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. సమ్మక్క- సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల నిధులు వెచ్చిస్తే.. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల నిధులు ఇచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బండి సంజయ్‌ రోడ్ల మీద తిరగడం కాదు ఢీల్లీ వెళ్లి గిరిజన యూనివర్సీటీ కోసం నిధులు మంజూరు చేయించాలని ఆమె అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రావాల్సిన నిధులు ఆగిపోయాయని బీజేపీ నేతలకు చాతనైతే ఆ నిధులు సాధించి రాష్ర్ట అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనవరంగా టీఆర్‌ఎస్‌పై బురద చల్లాలని బీజేపీ నాయకులు చూస్తున్నారన్నారు. కేంద్రం గిరిజనుల ను చిన్నచూపు చూస్తోందన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నేరవేర్చకుండా రోడ్ల మీద తిరగడం ఏంటని బీజేపీ నేతలపై మంత్రి సత్యవతి రాథోడ్‌ మండిపడ్డారు.

Related Articles

Latest Articles