ఇస్త్వాన్ స్జాబో, మార్టిన్ స్కోర్సెస్‌కు సత్యజిత్ రే అవార్డు

సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని కేంద్రం ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు వివరాలను వెల్లడించారు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్లు మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలకు అవార్డులు అందచేస్తామని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవాలో జరిగే 52వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు అందచేస్తామన్నారు.

మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. స్కోర్సెస్ అనేక అవార్డు సినిమాలు తీశారు. ట్యాక్సీ డ్రైవర్, గుడ్ ఫెల్లాస్ సినిమాలకు ఆస్కార్ అవార్డులు దక్కాయి. హంగేరియన్ ఫిల్మ్ డైరెక్టర్ ఇస్టావెన్ జాబో మెఫిస్టో వంటి అకాడమీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇఫ్పీ అవార్డుల విభాగంలో యువత ప్రతిభకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. దర్శకత్వం, నటన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్, ఓటీటీ విభాగాల్లో వారికి శిక్షణ ఇస్తామన్నారు. 75 ఏళ్ళ భారత స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న వేళ 75 విభాగాల్లో 35 ఏళ్ళ వయసున్న యువతీ, యువకులకు నిపుణుల ద్వారా శిక్షణా తరగతులు అందిస్తామన్నారు మంత్రి అనురాగ్ ఠాకూర్.

అందులో పాల్గొనబోయే వారిని జ్యూరీ ఎంపికచేస్తుందన్నారు మంత్రి. వారి ఇండస్ట్రీలో లబ్ధ ప్రతిష్టుల ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. కరోనా నేపథ్యంలో థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడలేనివారికి ఓటీటీలు మంచి వినోద సాధనంగా మారాయన్నారు. ఎన్నడూ లేని విధంగా BRICS (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలకు చెందిన ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.

Related Articles

Latest Articles