సత్యదేవ్ కు బంపర్ ఆఫర్…!

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో ‘పిట్ట కథలు’లో కనిపించిన ఈ యంగ్ హీరో ఖాతాలో “గుర్తుందా శీతాకాలం”, “తిమ్మరుసు”, “గాడ్సే” వంటి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోకు బాలీవుడ్ లో నటించే బంపర్ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించబోయే భారీ చిత్రం ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కు కీలక పాత్ర పోషించే సువర్ణావకాశం లభించింది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సహకారంతో అమెజాన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో సౌత్ నటులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. సత్యవ్‌దేవ్‌తో పాటు, నాజర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సత్యదేవ్ తన ప్రతిభను బాలీవుడ్ లో ప్రదర్శించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ని చెప్పొచ్చు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-