త్వరలో సెట్స్ పైకి సత్యదేవ్ ‘లాక్డ్’ సీజన్ 2

ఆహాలో ప్రసారమై, చక్కని ఆదరణ పొందిన సర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ లాక్డ్‌. దీనిని సంబంధించిన రెండో సీజ‌న్ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. వైద్య‌శాస్త్రంలో క‌ఠిన‌త‌ర‌మైన ఎన్నో కేసుల‌కు ప‌రిష్కారాల‌ను సూచించిన గొప్ప న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఆనంద్ పాత్ర‌లో సత్యదేవ్ నటించారు. అయితే తన పేరు ప్ర‌తిష్టల‌ను నాశ‌నం చేయ‌గ‌ల ఓ ర‌హ‌స్యాన్ని ఈ ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచేస్తాడు. లాక్డ్‌ సీజ‌న్ 1ను డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ దేవ కుమార్ సీజ‌న్‌ 2ను కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ ‘లాక్డ్’ సీజ‌న్ 2లో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉండబోతున్నాయి.

లాక్డ్‌ సీజ‌న్ 1లో చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసే ముగ్గురు దొంగ‌లు డాక్ట‌ర్ ఆనంద్ ఇంట్లోకి ప్ర‌వేశిస్తారు. అక్క‌డ వారికి ఆనంద్ జీవితంలోని చీక‌టి కోణం గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి ప్ర‌వేశించే ఎంతో మంది నిమిషాల్లో హ‌త‌మ‌వుతుంటారు. స‌త్య‌దేవ్‌, సంయుక్తా హెగ్డే, కేశ‌వ్ దీప‌క్‌, శ్రీల‌క్ష్మి, బిందు చంద్ర‌మౌళి త‌దిత‌రులు న‌టించిన తొలి సీజ‌న్ ప‌లు ట్విస్టులు, ట‌ర్న్స్‌ కారణంగా ప్రేక్ష‌కులను ఆకట్టుకుంది. కథ ప‌రంగా, స్కేల్‌ అండ్ విజ‌న్ ప‌రంగానే కాకుండాలాక్డ్ రెండో సీజ‌న్ వెన్నులో భ‌యాన్ని క‌లిగించే ఎలిమెంట్స్‌తో చక్కని మేకింగ్ స్టాండ‌ర్స్ తో ఉంటుందని దీని ప్రొడ్యూసర్స్‌ చెబుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-