ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్

కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన పరీక్షల అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇటీవల కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చాయి. దాంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. గత రాత్రి సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అప్ డేట్ రావాల్సి ఉంది.

Read Also : ఆస్కార్ విన్నింగ్ లెజెండరీ నటుడు కన్నుమూత

చాలా మంది ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, తమన్, మంచు లక్ష్మి, త్రిష, ప్రియదర్శన్‌ లకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇక సత్యరాజ్ విషయానికొస్తే… విభిన్నమైన పాత్రలో తమిళంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘బాహుబలి’తో ప్రపంచానికి కట్టప్పగా పరిచయం అయ్యారు. చాలామందికి ఇప్పుడు ఆయన కట్టప్పగానే సుపరిచితుడు.

Related Articles

Latest Articles