త‌మిళ రాజ‌కీయంలో మ‌ళ్లీ గంద‌ర‌గోళం…శ‌శిక‌ళ మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తుందా?

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి మ‌ళ్లీ శ‌శిక‌ళ రాబోతుందా అంటే కొంత‌మంది అవున‌నే అంటున్నారు.  2016లో ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌రువాత పార్టీని తాత్కాలికంగా త‌న చేతుల్లోకి తీసుకున్నారు.  అనంత‌రం ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష‌ను అనుభ‌వించిన శ‌శిక‌ళ త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ముందు బెయిల్‌పై విడుద‌ల‌య్యారు.  పార్టీలో తిరిగి చేరాల‌న్న ఆమె క‌ల‌ను ప‌ల‌నీస్వామీ, ప‌న్నీర్ సెల్వంలు అడ్డుకున్నారు.  చిన్న‌మ్మ తిరిగి పార్టీలోకి రాకుండా స‌మ‌ర్ధ‌వంతంగా పార్టీని కాపాడుకుంటూ వ‌చ్చారు.  ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్నాడిఎంకే ఓట‌మిపాలైనప్ప‌టికీ, ఆ పార్టీ మెరుగైన స్థానాల్లో విజ‌యం సాధించింది.  శ‌శిక‌ళ‌కు, ఆమె కుటుంబ స‌భ్యులు ఎవ‌రికీ పార్టీలో స్థానం ఇవ్ప‌కూడ‌ద‌ని ఇప్ప‌టీకే అన్నాడీఎంకే నిర్ణ‌యం తీసుకున్న‌ది.  అయితే, పార్టీలో ముఖ్య‌నేత‌ల మ‌ధ్య అంత‌ర్యుద్ధం జ‌రుగుతుంద‌ని, పార్టీ కార్య‌కర్త‌ల‌తో ఆమె ట‌చ్‌లో ఉన్నారనీ, ఈ స‌మయంలో పార్టీలోకి ప్ర‌వేశించి అన్నాడిఎంకేలో చక్రం తిప్పాల‌ని చూస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ వార్త‌ల‌పై పార్టీ డిప్యూటి కోఆర్టినేట‌ర్ మునుస్వామి స్పందించారు. ప‌ళ‌నీస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీని స‌మ‌ర్ధ‌వంతంగా న‌డుపుతున్నార‌ని, ముఖ్య‌నేత‌ల మ‌ద్య ఎలాంటి అభిప్రాయ భేధాలు లేవ‌ని, శ‌శిక‌ళ‌ను పార్టీలోకి తీసుకునే ఆలోచ‌న లేదని ఆయ‌న పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-