హ్యాపీ మదర్, హాట్ డాటర్, హెయిర్ ఆయిల్!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు. అయితే, ఆమె ఆయనతో కంటే తల్లి అమృతా సింగ్ తోనే ఎక్కువగా పెరిగింది. సైఫ్, అమృతా విభేదాల కారణంగా విడిపోవటంతో సారా మమ్మీతోనే ఉండాల్సి వచ్చింది. అలా ఈ బ్యూటిఫుల్ డాటర్ కి డాడ్ కంటే ఎక్కువగా మామ్ కే క్లోజ్! సారా స్వయంగా కూడా ఈ విషయం చాలా సార్లు చెప్పింది. ఆమె తన సొషల్ మీడియా అకౌంట్స్ లో అమ్మ అమృతా సింగ్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు గార్జియస్ లేడీస్ ఓ హెయిర్ అయిల్ బ్రాండ్ కోసం కలసి యాడ్ లో యాక్ట్ చేశారు!

‘మమాఎర్త్’ అనే బ్రాండ్ కోసం అమృతా, సారా కలసి కెమెరా ముందుకు వచ్చారు. తాజా టెలివిజన్ కమర్షియల్ లో ఇద్దరూ హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేస్తున్నారు. అయితే, సారా ఇప్పటికే చాలా బ్రాండ్స్ ని ఎండార్స్ చేస్తూ కార్పొరేట్ కంపెనీల ఫేవరెట్ గాళ్ గా ఉంది. అమృతా సింగ్ మాత్రం 30 ఏళ్ల తరువాత బ్రాండ్ ప్రమోషన్ కోసం కెమెరా ముందుకొస్తోంది. ఆమె దశాబ్దాల క్రితమే స్వచ్ఛందంగా యాడ్స్ కి దూరమైంది. అడపాదడపా సినిమాల్లో నటించినా కంటిన్యూగా లైమ్ లైట్లో ఉండలేదు. చూడాలి మరి నట వారసురాలు సారాతో కలసి యాడ్ లో నటించాక అమృతా సింగ్ మనసు మార్చుకుంటుందేమో! వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అవుతుందేమో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-