ఒక్క నిమిషం కోసం.. పది నెలలు కష్టపడ్డా- హీరోయిన్

ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం వారు ఎంతో శ్రమిస్తారు. చిత్రం విడుదలయ్యాకా ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ వారి కష్టానికి ప్రతి ఫలం. సినిమాలో కష్టమైన ఫైట్ కోసమో, సాంగ్ కోసమో ముందు నుంచే వారు రిహార్సల్స్ చేస్తారు. ఇక క్రీడల నేపథ్యంలో సినిమాలైతే కొన్ని రోజులు వారు కూడా క్రీడాకారులుగా మారిపోతారు. తాజాగా ‘దంగల్’ బ్యూటీ.. తాను ఆ సినిమా కోసం పడిన కష్టాన్ని వివరించింది. ‘దంగల్’ సినిమాలో అమీర్ ఖాన్ రెండో కూతురిగా, రెస్లర్‌ బబితా కుమారిగా నటించి మెప్పించిన హీరోయిన్ సాన్యా మల్హోత్రా. ఈ సినిమాతో అమందికి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు.. దంగల్ కోసం ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది. ” దంగల్.. నా మొదటి సినిమా.. చాలా భయం వేసింది. అందుకే నా పాత్రకు తగ్గ న్యాయం చేయాలనీ గట్టిగా అనుకున్నా.. ‘దంగల్’లో నేను రెస్లింగ్ చేసింది కేవలం ఒక్క నిమిషం మాత్రమే పది నెలలు కుస్తీ నేర్చుకున్నా.. నా పాత్రను నేను సంపూర్ణంగా స్వీకరించా .. దానికోసం నాపై నేనే ఒత్తిడి తెచ్చుకున్నా.. అందుకే ఆ సీన్ అంత బాగా వచ్చి నాకు పేరు తెచ్చిపెట్టింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం సాన్యా పలు హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

Related Articles

Latest Articles