ట్రోలర్స్ కు టాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్

మలయాళ భామ సానుష చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. 2012లో “మిస్టర్ మారుమకన్” చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన “జీనియస్” సినిమాలో హీరోయిన్ గా నటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన నాని “జెర్సీ”లో సనుషా చివరిసారిగా కనిపించింది. ఇక అసలు విషయంలోకి వస్తే… సానుష తాజాగా తనను బాడీ షేమింగ్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేసింది. “ఓహ్ అవును !! బహుశా నాకన్నా ఎక్కువగా నా బరువు గురించి ప్రస్తావిస్తూ, దాని గురించి చింతిస్తూ & దాని గురించి ఎక్కువగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ, స్వీట్‌హార్ట్, మనం బతికేది ఈ బరువు తగ్గడానికి అలాగే అందంగా కనిపించడానికి మాత్రమే కాదు. ముఖ్యంగా ఇతరులను బాడీ షేమింగ్ చేసేవారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే… మీరు ఒక వ్యక్తి వైపు 2 వేళ్లు చూపిస్తున్నప్పుడు మిగతా మూడు వేళ్ళు మీ వైపు చూపిస్తాయి. మీరు కూడా పర్ఫెక్ట్ గా లేరు…. శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి” అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Sanusha Santhosh💫 (@sanusha_sanuuu)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-