సంతోష్, మెహ్రీన్ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మిల్కీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సిరీస్‌ రూపొందనుంది. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ సమయంలోనే దర్శకుడు మారుతీ ఈ వెబ్ సిరీస్ కోసం కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్ని మహమ్మారి ప్రోటోకాల్‌లను అనుసరించి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు “మంచి రోజులు వచ్చాయి” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసిన మెహ్రీన్ ఈ వెబ్ డ్రామాతో డిజిటల్ ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి సిద్దమైంది. మరోవైపు తన మునుపటి చిత్రం “ఏక్ మినీ కథ”తో ప్రశంసలు అందుకున్న సంతోష్ శోభన్ కూడా ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-