‘గాడ్స్ ఓన్ కంట్రీ’లో జీ కుటుంబం సంక్రాంతి సంబరాలు!

ఆంగ్ల నూతన సంవత్సరంలో తెలుగు వాళ్ళు జరుపుకునే తొలి పండగ సంక్రాంతి. సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే పండగ ఇది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ… అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగ చేసుకుంటారు. అయితే రొటీన్ కు భిన్నంగా ఈసారి కేరళ ఆచార వ్యవహారాలను తెలుగువారికి పరిచయం చేసే పని పెట్టుకుంది జీ తెలుగు ఛానెల్. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని, ‘ఫుడ్ బౌల్ ఆఫ్ సౌత్’ అని కేరళలను అభిమానంగా పిలుచుకుంటారు జనం. అందుకే ఈ సారి జీ కుటుంబ సభ్యులను కేరళకు తీసుకెళ్ళింది. విశేషం ఏమంటే అక్కడ కార్యక్రమం మొత్తాన్ని తన భుజానకెత్తుకుని నిర్వహించింది కేరళ తనయ సుమ కనకాల. జీ కుటుంబ సభ్యులతో సుమ రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది. కలరిపట్టు పోరాటం, కొబ్బరి, గోనె సంచులతో పోటీలు, సైక్లింగ్, కబడ్డి ఆటలు ఆడించింది. ఇవి కాకుండా కేరళకు చెందిన వల్లంకళి (బోట్ రేస్)ను సైతం మన బుల్లితెర నటీనటులు ఆడేశారు. వీరంతా నాలుగు జట్లుగా ఏర్పడి, కేరళలోని అందమైన బ్యాక్ వాటర్ లో బోట్ రేస్ లో పాల్గొన్నారు. కేరళలో సంక్రాంతి అల్లుళ్ళు చేసే సందడి అంతా భోగి రోజున అంటే 13వ తేదీ ఉదయం 9 గంటల నుండి మూడు గంటల పాటు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది.

ఇక తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండగ కూడా. ఆ సీజన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా… ఉత్సాహంగా కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేస్తుంటారు. వారికోసం సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల నుండి మూడు గంటల పాటు సంక్రాంతి సోగాళ్ళు నాగార్జున, నాగచైతన్యతోనూ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ‘బంగార్రాజు’ చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని వీక్షకులకు వినోదాల విందు అందించబోతున్నారు. సో… ఈ సంక్రాంతిని జీ తెలుగు డాన్సులు, కామెడీ స్కిట్స్, మ్యూజిక్ తో సంస్కృతి, వినోదాల మేళవింపుగా జరుపుకోబోతోంది.

Related Articles

Latest Articles