సల్మాన్ అవుట్… హృతిక్ ఇన్…!!

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 2019లో ప్రకటించిన తన డ్రీం ప్రాజెక్ట్ “ఇన్షల్లా”. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఆయన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అలియా భట్ జంటగా నటింపజేయాలని అనుకున్నారు. అయితే చిత్రనిర్మాత, సల్మాన్ ఖాన్ కు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేశారు. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ పట్టాలెక్కించడానికి భన్సాలీ సన్నాహాలు చేస్తున్నారట. కానీ సల్మాన్ ప్లేస్ లో హృతిక్ రోషన్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ కు జోడిగా అలియా భట్ నటించబోతోంది.

Read Also : పుకార్లకు చెక్ పెట్టిన తలైవి

మీడియా కథనాల ప్రకారం భన్సాలీ ప్రస్తుతం “హీరా మండి” అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. మరోవైపు “గంగూబాయి కతియావాడి”ని పూర్తి చేసి “ఇన్షల్లా”పై కూడా దృష్టి సారించారు. ఇప్పటికే హృతిక్ కు కథను వివరించగా, ఆయనకు బాగా నచ్చిందట. కానీ స్క్రిప్ట్‌ లో కొన్ని మార్పులు చేయమని కోరాడట హృతిక్. దీంతో భన్సాలీ స్క్రిప్ట్‌పై రీ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. 2022 ద్వితీయార్ధంలో “ఇన్షల్లా” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భన్సాలీ, అలియా భట్ “గంగూబాయి కతియావాడి” రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు హృతిక్ “విక్రమ్ వేదా” హిందీ రీమేక్, ‘ఫైటర్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాత “ఇన్షల్లా” ప్రారంభం కానుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ… ఒకవేళ నిజమైతే ఇది 2010లో వచ్చిన “గుజారీష్” తర్వాత భన్సాలీ, హృతిక్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-