ఫిల్మ్ సిటీ నిర్మాణంలో స్టార్ హీరో

చాలా మంది సినీ ప్రముఖులు ఇతర వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే.. కథానాయికలు సైతం సైడ్ బిజినెస్ లో మక్కువ చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్స్ బిజినెస్ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సునీల్ శెట్టి, కరిష్మా కపూర్, శిల్పా శెట్టి, మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ తదితర స్టార్స్ అందరు బిజినెస్ లో సక్సెఫుల్ గా రాణిస్తున్నారు.

అయితే, తాజాగా సీనియర్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఏకంగా ఫిల్మ్ సిటీనే నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో వివిధ స్థలాలను పరిశీలించిన ఆయన రామ్​ టెక్​లో ఖిండ్సీ ప్రాంతంలో విదర్భ ఫిల్మ్​సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సంజయ్​తో పాటు ఆ రాష్ట్ర మంత్రి నితిన్​​ రౌత్‌ భాగస్వామ్యం కూడా వుండనున్నట్లు బాలీవుడ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కలిసే స్థలాన్ని సందర్శించారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

Sanjay Dutt visits city, Ramtek to explore for setting up Film City

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-