మహేష్ సినిమాలో రాజకీయనాయకుడుగా సంజయ్ దత్

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో పూజా హేగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కె.జి.ఎఫ్‌ 2 లో అధీరాగా నటిస్తున్న సంజయ్ దత్ మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ గా కనిపిస్తాడట.

Read Also : రెండు పోనీటైల్స్ తో రణవీర్

ఇందులో నభా నటేష్ సెకండ్ హీరోయిన్ గా ఎంపికైందట. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ‘పార్ధు’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. గతంలో మహేష్ – త్రివిక్రమ్ నటించిన ‘అతడు’లో హీరో పేరు కూడా ‘పార్థు’నే కావటం విశేషం. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతదర్శకుడుగా ఎంపికైనట్లు సమాచారం. దీపావళి తర్వాత షూటింగ్ మొదలు పెడతారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-