సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ మూవీ ఓటీటీ డేట్

దీపావళి కానుకగా సినీ ప్రేక్షకులకు ఓటీటీ వేదికగా మరో సినిమా అందుబాటులోకి రానుంది. సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా ఓటీటీ డేట్స్ ఫిక్సయింది. ఈ మూవీ నవంబర్ 4 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడీగా నేహాశెట్టి నటించింది. కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, హర్ష, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎంవీవీ సినిమాస్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.

Read Also: ‘పెద్దన్న’తో పోటీపడబోతున్న ‘ఎనిమి’

ఇప్పటికే దీపావళి కానుకగా పలు కొత్త సినిమాలు ఓటీటీల్లో రానున్నాయి. సూర్య నటించిన ‘జైభీమ్’ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. మరోవైపు సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో దీపావళి నుంచే ప్రారంభం కానుంది. మొత్తానికి దీపావళి పండగ సినిమా ప్రేక్షకులకు వినోదాలను పంచనుంది.

సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ' మూవీ ఓటీటీ డేట్

Related Articles

Latest Articles