తెలంగాణ ప్ర‌భుత్వానికి రైతుల జాబితాను ఇస్తామన్న ఎస్‌కెఎం…

తెలంగాణ ప్ర‌భుత్వానికి రైతుల (అమ‌ర‌వీరుల) జాబితాను ఇస్తామని “సంయుక్త కిసాన్ మోర్చా” తెలిపింది. రైతు ఉద్య‌మంలో సుమారు 700 మంది రైతులు చేసిన త్యాగాలను ప్ర‌ధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం గుర్తించనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చింది. అమరవీరుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ప్ర‌క‌టించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కూడా ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర‌ ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించాలని, రైతుల‌పై అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే రైతు (అమరవీరులు) కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి జాబితాను అందజేస్తాం” అని తెలిపిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

Related Articles

Latest Articles