ఆగస్ట్ లో థియేటర్లలోకి ‘బజార్ రౌడీ’

‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి వినోద ప్రధాన చిత్రాల్లో హీరోగా నటించి, ప్రేక్షకులను మెప్పించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు దీనిని నిర్మించారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, ”ఈ చిత్ర క‌థ కి సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా తీర్చిదిద్దాం. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌రావు త‌నకున్న అనుభ‌వాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చారు. సంపూ సరసన మహేశ్వరి వద్ది హీరోయిన్ గా నటించగా షియాజి షిండే, పృథ్వి, నాగినీడు, ష‌ఫి, స‌మీర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. జాషువా మాస్ట‌ర్ ఫైట్స్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటాయి, అలాగే ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, సినిమాను ఆగ‌ష్టు లో థియేటర్లలో విడుద‌ల చేస్తాం” అని అన్నారు. సంపూర్ణేష్ బాబు కెరీర్ లో ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వసంత నాగేశ్వరరావు వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-