నిన్న కొడుకుతో… నేడు తండ్రితో…

చిరంజీవితో సంపత్ నంది సినిమా!?

‘సీటీమార్’ వంటి కమర్షియల్ హిట్ తో ఊపుమీద ఉన్నాడు డైరెక్టర్ సంపత్ నంది. గోపీచంద్ వంటి ప్లాప్ స్టార్ కి హిట్ ఇవ్వటమే కాక టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపు తెచ్చాడు. ఈ హిట్ తో ఏకంగా మెగా స్టార్ ని దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడట సంపత్ నంది. మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్నది సంపత్ నంది కల. గతంలో వీరి కలయికలో సినిమా వస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. రామ్ చరణ్ తో ‘రచ్చ’ చేసినప్పటి నుంచి చిరంజీవి సంపత్‌ తో సినిమా చేయాలనుకున్నారట. అయితే ఎందుకో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. అయితే ‘సీటీమార్’ విజయం తర్వాత ఆ అవకాశాలు మెరుగయ్యాయనే చెప్పవచ్చు. చిరంజీవి ఇమేజ్ ని బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని సంపత్ ఓ లైన్ వినిపించాడట. చిరు కూడా ఆసక్తిని వ్యక్తం చేసి పూర్తి స్క్రిప్ట్‌ తో రమ్మని కోరినట్లు వినికిడి.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి చేసిన మోహన్ రాజాతో చిరు ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేశ్ తో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో సినిమా కమిట్ అయి ఉన్నారు. సరైన రీతితో స్క్రిప్ట్ సిద్ధం చేస్తే సంపత్ కు చిరుతో అవకాశం ఖాయం. గతంలో రామ్ చరణ్‌ కి ‘రచ్చ’ లాంటి మాస్ ఇంటర్ టైనర్ ఇచ్చిన సంపత్ చిరుతో ఎలాంటి సినిమా చేస్తాడో చూద్దాం…. ఆల్ ద బెస్ట్ సంపత్.

నిన్న కొడుకుతో… నేడు తండ్రితో…

Related Articles

Latest Articles

-Advertisement-