రిపబ్లిక్ డే కు వస్తానంటున్న ‘సామాన్యుడు’

యాక్ష‌న్‌ హీరో విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతోంది ‘సామాన్యుడు’. నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ద్వారా తు. పా. శరవణన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభించింది.

నిజానికి ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలని విశాల్ భావించాడు. కానీ భారీ చిత్రాలన్నీ డిసెంబర్ నెలతో పాటు, జనవరి ప్రథమార్ధంలో విడుదల అవుతుండటంతో తన నిర్ణయం మార్చుకున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. విశాల్ స‌ర‌స‌న‌ టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పి.ఎ. తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ కి ప‌లు చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన యువన్ శంకర్ రాజా ‘సామాన్యుడు’కు సంగీతం అందిస్తున్నారు.

Related Articles

Latest Articles