‘యశోద’ సెకండ్ షెడ్యూల్ మొదలు

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం రోజు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం” అని చెప్పారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి సీనియర్ సినీ పాత్రికేయులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మీ సంభాషణలు అందిస్తుండటం విశేషం.

Related Articles

Latest Articles