సమంత ఆధ్యాత్మిక యాత్ర పూర్తి… గ్రేట్ మిస్టరీ అంటూ స్పెషల్ పోస్ట్

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉంది. నాగ చైతన్యతో విడాకుల విషయం ప్రకటించిన అనంతరం సామ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాత్మిక ట్రిప్ వేస్తోంది. ఈ ట్రిప్ లో సామ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. చార్ ధామ్ యాత్రను ముగించిన సమంత తాజాగా గ్రేట్ మిస్టరీ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ వంటి అద్భుతమైన ప్రాంతాలను సందర్శించినట్టు పేర్కొంది సమంత. మహాభారతం చదివినప్పటి నుండి హిమాలయాల పట్ల తాను ఆకర్షితురాలినని అయ్యానని చెప్పింది. “మహాభారతం చదివినప్పటి నుండి గ్రేట్ మిస్టరీని, దేవుళ్ళు నివాసం ఉండే ప్రాంతమైన ఈ భూలోక స్వర్గాన్ని సందర్శించాలని అనుకుంటున్నాను” అంటూ తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Read Also : రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!

కాగా సమంత చివరిగా దర్శకులు రాజ్ అండ్ డికే తెరకెక్కించిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో కనిపించింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాగా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తన నెక్స్ట్ మూవీ “శాకుంతలం” విడుదల కోసం వెయిట్ చేస్తోంది. మరోవైపు తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కాతువాకుల రెండు కాదల్” సినిమాలోనూ కనిపించనుంది. ఇటీవల నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత శాంతరూపన్, దర్శక ద్వయం హరి-హరీష్‌లతో రెండు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలకు సంతకం చేసింది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Related Articles

Latest Articles