వెడ్డింగ్ డే సందర్భంగా సమంత ఆసక్తికరమైన పోస్ట్!

2017 అక్టోబర్ 7వ తేదీ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున గోవాలో హిందు సంప్రదాయ పద్ధతిలోనూ, ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలోనూ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పదేళ్ళ స్నేహం, ఏడేళ్ళ ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధం అక్టోబర్ 2న పటాపంచలైపోయింది. అదే జరిగి ఉండకపోతే, ఇవాళ వారిద్దరూ అందరికీ దూరంగా ఏకాంతంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని ఉండేవారేమో! చైతు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత బ్రేక్ అప్ కు సంబంధించిన సమాచారం అక్టోబర్ 2న పోస్ట్ చేశాక, మళ్ళీ ఈ రోజు ఓ పోస్ట్ పెట్టింది. ఇవాళ ఆమె వెడ్డింగ్ డే కావడంతో ఆ పోస్ట్ కు ప్రాధాన్యం సంతరించుకుంది.

‘మూవ్ ఆన్’ అనే పదాన్ని సినిమా జనాలంతా నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు. అలా కాకపోతే కష్టం కూడా. అందుకే సమంత సైతం ఇతర వ్యాపకాలతో బిజీ అయిపోతోంది. ముఖ్యంగా రేపు జరుగబోతున్న లక్మే ఫ్యాషన్ వీక్ కు సమంత సిద్ధం అవుతోంది. బహుశా దానికి సంబంధించిన ఫోటోనే ఆమె ఇవాళ ఉదయం ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. పొడుగాటి వైట్ ఫ్రాక్, నల్లని కురులు, మధ్యలో రెండు పింక్ గులాబీలు, మునివేళ్ల పై నిలిచి సమంతను ఆ ఫోటోలో చూస్తుంటే ఏదో కనిపించని పెయిన్ తో ఆమె బాధపడుతున్నట్టు అర్థమౌతోంది. ‘పాత ప్రేమ పాటలు, పర్వతాలు, శిఖరాలనుండి వచ్చే శీతాకాలపు గాలి సవ్వడి, లోయలోంచి మెలంచోలిక్ ప్రతిధ్వని, పాత ప్రేమికుల గీతాలు’ అంటూ ఆమె మనసు పడుతున్న మనోవేదనను వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేసింది.

మరి టాటూల సంగతి ఏమిటీ!?

ఈ కాలం కథానాయికలు చాలామంది లానే సమంతకూ టాటూస్ అంటే పిచ్చి. తన జీవితంలో ఎదురైన ప్రత్యేక సందర్భాలను టాటూస్ రూపంలో జ్ఞాపికలుగా మార్చుకుంది సమ్ము. ‘ఏమాయ చేసావే’ మూవీ ఘన విజయం తర్వాత సమంత ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ విజయ చిహ్నంగా మెడపై వైఎంసీ అనే అక్షరాలను టాటూగా వేయించుకుంది.

విశేషం ఏమంటే… అదే సినిమాలో ఆమె తొలిసారి నాగచైతన్యను కలిసింది. అలా మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఇక కుడి పక్కటెముకలపై మొన్నటి వరకూ తన జీవిత భాగస్వామి అయిన నాగచైతన్య సంతకాన్ని టాటూగా వేయించుకుంది. ఇది కాకుండా ఆమె మణికట్టు మీద కూడా బాణం గుర్తు టాటూ ఒకటి ఉంటుంది. దీని వెనుక కథ ఏమిటనేది తెలియదు. ఈ మూడు కాకుండా సమంత నడుము వెనుక భాగంలోనూ ఓ టాటూ ఉందని చెబుతుంటారు. దాని గురించి చాలామందికి తెలియదట. మొత్తం మీద చైతు నుండి విడిపోతున్న నేపథ్యంలో సమంత ఆ టాటూస్ ను తీసేయిస్తుందా లేక అలానే ఉంచేస్తుందా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా నటిగా కొనసాగుతున్న సమంత ఈ రెండింటిలో ఏది చేసినా జనాలకు తెలియకపోదు! కాకపోతే కొన్ని రోజుల పాటు ఓపికగా వేచి ఉండాలి. అంతే!

వెడ్డింగ్ డే సందర్భంగా సమంత ఆసక్తికరమైన పోస్ట్!
వెడ్డింగ్ డే సందర్భంగా సమంత ఆసక్తికరమైన పోస్ట్!
వెడ్డింగ్ డే సందర్భంగా సమంత ఆసక్తికరమైన పోస్ట్!
వెడ్డింగ్ డే సందర్భంగా సమంత ఆసక్తికరమైన పోస్ట్!
-Advertisement-వెడ్డింగ్ డే సందర్భంగా సమంత ఆసక్తికరమైన పోస్ట్!

Related Articles

Latest Articles