సైకిల్ పై ఫ్రెండ్స్ తో చక్కర్లు కొడుతున్న సామ్… పిక్ వైరల్

సమంత అక్కినేని గత కొన్ని రోజులుగా డివోర్స్ వార్తలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే వాటన్నింటికీ సామ్ ఒకే ఒక్క పోస్ట్ తో ఫుల్ స్టాప్ పెట్టిసింది. ఆ పోస్ట్ లో కుక్కపిల్లలను చూపిస్తూ మీడియా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపిస్తుందని కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా సమంతకు సంబంధించిన ఓ తాజా ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పిక్ లో సామ్ సంతోషంగా కన్పిస్తోంది. పైగా ఫ్రెండ్స్ తో కలిసి సైకిల్ పై చక్కర్లు కొడుతూ కన్పించింది. సామ్ తో పాటు ఆమె క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ ఫోటోను సామ్ ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది. సామ్ ఎప్పటిలాగే పూల బైకర్ షార్ట్ ధరించి అందంగా, ఫిట్‌గా కన్పించింది.

Read Also : “రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్

సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది సామ్. సమంత అక్కినేని ప్రస్తుతం పౌరాణిక చిత్రం “శాకుంతలం”లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ, మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నెక్స్ట్ ఆమె నయనతార, విజయ్ సేతుపతితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న “కాతు వాకుల రెండు కాదల్‌” సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-